సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అంటే సుందరానికి’ చిత్రం..రన్ టైం ఎంతంటే?

0
86

న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే మంచి సారాంశం ఉన్న కథలను ఎంచుకుంటూ ఎల్లప్పుడూ ప్రేక్షకులకు దగ్గరవుతాడు. ఇటీవలే నటించిన అన్ని సినిమాలు దాదాపు రికార్డ్స్ క్రీయేట్ చేసిన విషయం అందరికి తెలిసిందే. శ్యామ్ సింగరాయ్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న న్యాచురల్ స్టార్ నాని తరువాత ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా క్రమంలో ఈ యంగ్ హీరో తాజాగా అంటే సుంద‌రానికీ సినిమాతో మళ్ళి ప్రేక్షకులను అబ్బురపరచడానికి మనముందుకొస్తున్నాడు.

వేక్ ఆత్రేయా ద‌ర్శ‌క‌త్వంలో తెరెకెక్కిన ఈ సినిమాలో నానికి జోడీగా న‌జ్రియా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో నాని బ్ర‌హ్మ‌ణుడి పాత్ర‌లో న‌టించ‌గా, న‌జ్రియా క్రిస్టియ‌న్ అమ్మాయిగా న‌టించింది. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల కానున్నక్రమంలో ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవలే ఈ చిత్రం ట్రైల‌ర్, టీజ‌ర్‌కు , పాటలకు రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ ‘యూ’ స‌ర్టిఫీకేట్ ఇచ్చింది. ర‌న్ టైం 2 గంట‌ల 56 నిమిషాలుగా ఫిక్స్ చేసిన‌ట్లు స‌మాచారం తెలుస్తుంది.  ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల‌లో మొద‌టి నుంచి భారి అంచ‌నాలు ఉండగా..జూన్ 10న ధీయేటర్లలో సందడి చేయనుంది.