ఆసక్తిని రేపుతున్న ‘చాణక్య’ ఫస్టులుక్ పోస్టర్

ఆసక్తిని రేపుతున్న 'చాణక్య' ఫస్టులుక్ పోస్టర్

0
96

తెలుగు నటుడు గోపీచంద్ త్వరలో ‘చాణక్య’ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ ప్రకటించగా నేడు (జూన్ 12) హీరో పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. భారీగా గడ్డం పెంచేసిన సీరియస్ లుక్‌లో గోపీచంద్ దర్శనమిచ్చారు. . వైవిధ్యభరితమైన కథాకథనాలతో నిర్మితమవుతోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది.

క్రౌడ్‌లోనుండి నడుచుకుంటూ వస్తున్న గోపిచంద్‌ని ఫోకస్ చేస్తూ ఫస్ట్ లుక్ డిజైన్ చేసారు. ఇటీవల ఇండియా, పాకిస్థాన్ బోర్డర్‌లో గల జైసల్మేర్ పరిసర ప్రాంతాల్లో ఫస్ట్ షెడ్యూల్ జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుంది. స్పై థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చాణక్య, హీరోగా గోపిచంద్ 26వ సినిమా..