ఏపీఐఐసీ చైర్మన్‌గా రోజా… ఏపీ సీఎం జగన్ నిర్ణయం ?

ఏపీఐఐసీ చైర్మన్‌గా రోజా... ఏపీ సీఎం జగన్ నిర్ణయం ?

0
53

నగరి ఎంఎల్‌ఎ, వైసిపి కీలక నేత ఆర్‌కె.రోజా సెల్వమణి ని ఎపిఐఐసి చైర్మన్‌ గా సిఎం జగన్‌ నియమించారు. వరుసగా రెండోసారి ఎంఎల్‌ఎ గా రోజా ఎన్నికవడంతో పాటు పార్టీలో ముఖ్య నేతగా ఉన్న రోజా కు సామాజిక కోణ కేబినెట్‌ కూర్పుతో మంత్రి పదవి దక్కలేదు. దీంతో రోజాకు ఈ నామినేటెడ్‌ పోస్టును జగన్‌ కేటాయించినట్లు తెలుస్తోంది.

మంత్రిపదవి దక్కలేదని.. అందుకే మంత్రుల ప్రమాణస్వీకారానికి కూడా ఆమె హాజరు కాలేదని ఈ మధ్య ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌ను రోజా కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైకాపాలో అలకలు, బుజ్జగింపులు అంటూ ఏమీ ఉండవని..మంత్రి పదవి రాలేదని అసంతృప్తితో ఉన్నానన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా రోజాను ఏపీఐఐసీ ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.