సీఎం జగన్ పై జనసేన ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు..!!

సీఎం జగన్ పై జనసేన ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు..!!

0
86

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో జనసేన ఎమ్మెల్యే భేటీ అయ్యారు. జనసేన పార్టీకి చెందిన ఒక్కగానే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు జగన్‌ను కలిశారు. తొలిరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యే వరప్రసాద్ శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సీఎం జగన్ ఛాంబర్‌కు వెళ్లి ఆయనతో కాసేపు భేటీ అయ్యారు. అనంతరం సీఎం ఛాంబర్ నుంచి బయటకు వచ్చిన వరప్రసాద్.. తాను మర్యాదపూర్వకంగానే సీఎం జగన్‌ను కలిశానని మీడియాకు వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, శాసనసభలో జనసేన వాణిని వినిపిస్తానన్నారు. తాను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నుంచి విజయం సాధించానని, ప్రస్తుతం ఆయన తనయుడు జగన్ సీఎంగా ఉన్నప్పుడు మరోసారి అడుగు పెడుతున్నానని తెలిపారు. జనసేన పార్టీ శాసనసభలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటుందని వరప్రసాద్ తెలిపారు.