పవన్ కల్యాణ్‌ను గెలిపించండి.. ప్రజలకు అన్నయ్య చిరంజీవి సందేశం..

-

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను గెలిపించాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఓ వీడియో విడుదల చేశారు. జనమే జయం అని నమ్మే జనసేనానిని గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ఈ వీడియోలో విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

“కొణిదెల పవన్ కల్యాణ్… అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా… అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందు వాడిగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం మా తమ్ముడు కల్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కల్యాణ్… తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు వద్ద ప్రాణాలను ఒడ్డి పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తం అందివ్వడం… ఇలా ఎన్నెన్నో. ఆయన చేసిన పనులు చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంటుంది.

సినిమాల్లోకి తను బలవంతంగా వచ్చాడు. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధ పడుతున్న అమ్మకు ఈ అన్నయ్య ఒక మాట చెప్పాడు. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధమమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అని చెప్పాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచి వాళ్ల వల్లే ప్రజాస్వామ్యానికి ఎక్కువ నష్టమని నమ్మి జనం కోసం జనసైనికుడు అయ్యాడు. తను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్.

ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆ శక్తిని వినియోగించాలంటే చట్ట సభల్లో ఆయన గొంతును మనం వినాలి. జనమే జయం అని నమ్మే జనసేనాని ఏం చేయగలడో మీరు చూడాలంటే… పిఠాపురం ప్రజలు పవన్(Pawan Kalyan) ను గెలిపించాలి. సేవకుడిగా, సైనికుడిగా అండగా నిలబడతాడు, మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కల నిజం చేస్తాడు. పిఠాపురం ప్రజలకు మీ చిరంజీవి విన్నపం. గాజు గ్లాసు గుర్తుకు మీ ఓటు వేసి పవన్ కల్యాణ్ ను గెలిపించండి. జైహింద్” అంటూ చిరంజీవి(Chiranjeevi) ప్రజలకు తన సందేశాన్ని ఇచ్చారు.

మరోవైపు నేచురల్ స్టార్ నాని కూడా పవన్ కల్యాణ్‌కు మద్దతు తెలిపారు. సినీ కుటుంబంలో ఒకడిగా జనసేనానికి మద్దతు పలుకుతున్నట్లు వివరించారు. ‘ఈ ఎన్నికల పోరాటంలో మీరు గెలవాలి.. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలి. ఆల్ ది వెరీ బెస్ట్ సర్. ఫిల్మ్ ఇండస్ట్రీ మద్దతు కూడా పవన్ కల్యాణ్‌కే ఉంటుంది” అని ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు.

Read Also: వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...