సీఎం జ‌గ‌న్ పై పూరీ జ‌గ‌న్నాథ్ ట్వీట్ అదిరిపోయింది

సీఎం జ‌గ‌న్ పై పూరీ జ‌గ‌న్నాథ్ ట్వీట్ అదిరిపోయింది

0
103

ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సంక్షేమ ప‌థ‌కాల‌లో దూసుకుపోతున్నారు, మ‌రీ ముఖ్యంగా ఆయ‌న ప్ర‌వేశ పెడుతున్న సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు చాలా ల‌బ్ది చేకూరుతుంది, ఇక తాజాగా సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ను ఇటీవ‌ల పెద్ద‌లు క‌లుస్తున్నారు, ప్ర‌శంస‌లు ఇస్తున్నారు

తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై టాలీవుడ్ దర్శకుడు పూరిజగన్నాథ్ ప్రశంసలు కురిపించారు. నేషనల్ డాక్టర్స్ డే సంధర్బంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన టెక్నాలజీ తో రూపొందించిన 1,088 అంబులెన్స్‌లను ప్రారంభించారు, ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం చాలా బాగుంది అని అంద‌రూ ప్ర‌శంసించారు.

ప్రపంచమంతా కరోనాతో పోరాడుతుంటే జగన్ గారు 104, 108 అంబులెన్స్ లను ప్రారంభించారు. హాట్స్ ఆఫ్ జగన్ గారు 104,108 అంబులెన్స్ లను ఏపీలోని రూరల్ఏ, అర్బన్ ఏరియాలలో ఏర్పాటు చేసినందుకు. ఆంధ్రప్రదేశ్ లో అత్యవసర సమయాల్లో ఇవి ఉపయోగపడతాయి.అంటూ పూరిజగన్నాథ్ ట్వీట్ చేసారు. ఆయ‌న చేసిన ట్వీట్ కు ఇటు అభిమానులు కూడా మా జ‌గ‌న్ అన్న‌ మంచి నిర్ణ‌యాలు తీసుకున్నారు అని అంటున్నారు.