Comedian Prudhvi Raj – Ambati Rambabu | ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కల్యాణ్ నటించిన బ్రో సినిమా దుమారం రేపుతోంది. సినిమాలో మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)ను ఇమిటేట్ చేసి దూషించడాన్ని వైసీపీ శ్రేణులు సీరియస్‌గా తీసుకున్నారు. సినిమాలు వినోదం కోసం చేయాలని కానీ, రాజకీయాలను లాగడం ఏంటని ప్రశ్నించారు. మరోవైపు సినిమాలో ఎవరినీ ఉద్దేశించి క్యారెక్టర్స్ ప్లాన్ చేయలేదని, అది కేవలం సినిమాలో భాగం మాత్రమే అని పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.
ప్రస్తుతం ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ వర్సెస్ వైసీపీ కార్యకర్తల మధ్య వార్ నడుస్తోంది. దీనిపై మంత్రి సైతం స్పందించి పవన్ కల్యాన్‌పై విమర్శలు చేశారు. చివరకు ఇంతకు దిగజారిపోయావా? అని మండిపడ్డారు. ఇక సినిమాలో మంత్రి అంబటిని ఇమిటేట్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న 30 ఇయర్స్ పృథ్వీ(Comedian Prudhvi Raj) స్పందించారు. అంబటి రాంబాబును అనుకరించాల్సిన అవసరం తమకు లేదని.. ఆయన ఆస్కార్ స్థాయి నటుడేమీ కాదని అన్నారు.
ఈ చిత్రంలో తనది ఒక బాధ్యత లేని పాత్ర అని.. పబ్బులకు వెళ్తూ, అమ్మాయిలతో డ్యాన్స్ చేసే పాత్ర తనదని చెప్పారు. ‘బ్రో’లో ఒక చిన్న పాత్ర ఉందని, రెండు రోజులు పని చేయాలని దర్శకుడు సముద్రఖని తనకు చెప్పడంతో ఆ పాత్ర చేశానని అన్నారు. ఎవరినో కించపరుస్తూ సినిమాలో చూపించేంత నీచ స్వభావం పవన్ కల్యాణ్‌ది కాదని పృథ్వీ అన్నారు. పవన్ వ్యక్తిత్వం చాలా గొప్పదని కొనియాడారు.