“లైగర్” మూవీ నుండి క్రేజీ అప్డేట్..అదరగొట్టిన విజయ్ దేవరకొండ

0
41

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాతో ఫుల్ బిజీగా వున్నాడు. ఈ సినిమాను డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తుండగా..అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ‘లైగర్’ ఆగస్టు 25న విడుదలకానుంది.

మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో రౌడీ హీరో బాక్సర్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది. దీంతో అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది టీమ్. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే మాస్ సాంగ్ AKDIPAKDI ప్రోమో ని విడుదల చేశారు చిత్ర బృందం. ఫుల్ సాంగ్ ని ఈనెల 11న విడుదల చేయనున్నారు.

https://www.youtube.com/watch?v=wG-jYLsiSC0

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకోగా ఈ సాంగ్ ప్రోమో సినిమాపై అంచనాలు పెంచేశాయి. విజయ్ స్టెప్పులు ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తున్నాయి. ఇక ఈ సినిమా తరువాత వీరి కాంబినేషన్ లోనే ‘జనగణమన’ సినిమా రాబోతుంది. ఇది పూరి కలల ప్రాజెక్ట్ కావడం విశేషం.