Malaysia Masters: స్టార్​ షట్లర్​ పీవీ సింధుకు షాక్

0
112

భారత స్టార్​ షట్లర్ పీవీ సింధుకు మరోసారి చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్​ పోటీల్లో ఆమె ఓడిపోయి ఇంటిముఖం పట్టింది. రెండో సీడ్‌ తై జుయింగ్‌ (చైనీస్‌ తైపీ)పై 13-21 21-12 12-21 తేడాతో చతికిలపడింది. ఇప్పటి వరకు ఈ మ్యాచ్​తో కలిపి వీరిద్దరు 22 సార్లు తలపడగా.. సింధు అయిదింట్లో గెలవగా, 17 మ్యాచ్‌ల్లో తై జు పైచేయి సాధించింది.