ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రం మంచి సక్సెస్ అందించింది ప్రిన్స్ మహేష్ కి… ఆయనకు ఈ సినిమా పలు రికార్డులు నమోదు చేసింది, ఇక బిగ్గెస్ట్ హిట్ గా ఆయన కెరియర్ లో నిలిచింది, పాత రికార్డులు చెరిపేసింది, అయితే ఆయన సినిమాలు చూస్తే చాలా వరకూ ఆయన సినిమాలకు సంగీతం డీఎస్పీ అందిస్తారు.. కాని ఈసారి మహేష్ బాబు తన కొత్త సినిమాకి మాత్రం డీఎస్పీకి అవకాశం ఇవ్వడం లేదట.
మహేష్ బాబు 27వ సినిమాకి బాణీలు ఇచ్చేందుకు థమన్ ని ఎంపిక చేశారు అని తెలుస్తోంది. ఈ ఏడాది సంక్రాంతి పందెంలో మ్యూజిక్ పరంగా దేవీపై థమన్ పై చేయి సాధించాడు. సరిలేరు నీకెవ్వరు పాటల కంటే అల వైకుంఠపురములో సాంగ్స్ కి శ్రోతల్లో అద్భుత స్పందన వచ్చింది. అందుకే థమన్ కు మంచి పేరు వచ్చింది, స్టార్ హీరోలు తాజాగా థమన్ కి జై కొడుతున్నారు.
ఇక ఘంటసాల మనవడి గా అతడికి పరిశ్రమ లో ఉన్న క్రేజు ప్రతిసారీ ప్లస్ అవుతోంది. మహర్షి ఫేం వంశీ పైడిపల్లి ప్రిన్స్ 27వ సినిమాకి కి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సరిలేరు సక్సెస్ కావడంతో మహేష్ విదేశాలకు వెళుతున్నారు, అక్కడ నుంచి టూర్ ముగించుకుని ఇండియా కు తిరిగా వచ్చిన వెంటనే షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం వంశీ పైడిపల్లి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ముందుగానే వంశీ ప్రిన్స్ చర్చించుకుని థమన్ ని సంగీతానికి ఫిక్స్ చేశారట.గతంలో మహేష్ నటించిన దూకుడు- బిజినెస్ మెన్ చిత్రాలకు థమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.