మెగా హీరో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న దేవిశ్రీప్రసాద్..కారణం ఇదే..!!

మెగా హీరో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న దేవిశ్రీప్రసాద్..కారణం ఇదే..!!

0
60

ప్రతి సినిమాలో తన బాణిని వినింపించే సంగీత దర్శకుల్లో ఒకరు దేవిశ్రీ ప్రసాద్. ఇప్పటి వరుకు ఎన్నో చిత్రాలకు సంగీతం అందించిన ఆయన ఇప్పుడు మరో సినిమాకు సంగీతం అందించనున్నారు. వరుణ్ తేజ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ రూపొందుతోంది. కొంతకాలం క్రితం తమిళంలో హిట్ కొట్టిన ‘జిగర్తాండ’కి ఇది రీమేక్. తమిళంలో బాబీసింహా చేసిన పాత్రలో వరుణ్ తేజ్ .. సిద్ధార్థ్ పాత్రలో అథర్వ నటిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం పూజా హెగ్డేను సంప్రదించగా, ఆమె ఎక్కువ పారితోషికం అడిగిందనే వార్తలు వచ్చాయి.

ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ను ఎంపిక చేసుకున్నారు. అయితే ఆ తరువాత ఏమైందో తెలియదుగానీ, ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నాడనేది తాజా సమాచారం. ఆయన స్థానంలో మిక్కీ జె. మేయర్ ను తీసుకున్నారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులతోనే మిక్కీ జె. మేయర్ బిజీగా వున్నాడని అంటున్నారు. త్వరలోనే కథానాయిక ఎంపిక ప్రక్రియను కూడా పూర్తి చేయాలనే ఆలోచనతో హరీశ్ శంకర్ ఉన్నాడని అంటున్నారు.