ఎన్టీఆర్ తో గొడవ కి కారణం అదే – శ్రీనివాస్ రెడ్డి..!!

ఎన్టీఆర్ తో గొడవ కి కారణం అదే - శ్రీనివాస్ రెడ్డి..!!

0
46

నటుడి గా మంచిపేరు తెచ్చుకున్నా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు శ్రీనివాస రెడ్డి ! కమెడియన్ గా తెలుగు తెరకు పరిచయం అయి హీరోగా ఒక సినిమాను చేసిన శ్రీనివాస రెడ్డి త్వరలో దర్శకుడిగా మారబోతున్నాడు. ఇప్పుడు ఈదర్శకుడు అవతారంలో తన అదృష్టాన్ని వెతుక్కోబోతున్నాడు. ఈ సందర్భంగా ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఒకఇంటర్వ్యూలో ఒకప్పుడు జూనియర్ తో తనకు ఏర్పడ్డ విభేధాలలోని అసలు నిజాలను బయటపెట్టాడు. శ్రీనివాస రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న అతి కొద్దిమంది సన్నిహిత మిత్రులలో ఒకడిగా కొనసాగిన విషయాలను గుర్తు చేసుకుంటూ తన కూతురుకి స్వయంగా జూనియర్ పేరు పెట్టారని అన్నారు. తనకూతురు ఉయ్యాల ఫంక్షన్ కుజునియర్ స్వయంగా వచ్చి అన్నీ తానై నడిపించిన విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. అయితే తాను జూనియర్ కు దూరం కావడానికి కారణం జూనియర్ తో సన్నిహితంగా ఉండే కొందరు వ్యక్తులు చేసిన తప్పుడు ప్రచారమే అన్నారు.

2009 ఎన్నికల ప్రచారంలో తాను జూనియర్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయాలను గుర్తుకు చేసుకున్నారు. గతంలో జునియర్ కు జరిగిన కారు ప్రమదం గురించి అయన మాట్లడుతూ జూనియర్ కు ప్రమాదం జరిగిందని తెలుసుకుని అందరికంటే తాను ముందుగా యాక్సిడెంట్ స్పాట్ కు వెళ్ళి అతనికి రక్తం పారకుండ కట్టు కట్టి, దగ్గరలో ఉన్న తన అక్క ఇంటికి జూనియర్ ను తీసుకు వెళ్ళి అక్కడ ఉన్న డాక్టర్ చేత కుట్లు వేయించి ఆతరువాత మాత్రమే తాము కిమ్స్ హాస్పటల్ కు తీసుకు వెళ్లామన్నారు. దీంతో సన్నిహిత వ్యక్తి తాను లెగ్ పెట్టడం వల్లే జూనియర్ కు యాక్సిడెంట్ అయింది అని కామెంట్స్ చేసినప్పుడు తనకు విపరీతమైన కోపం వచ్చింది. ‘నేను ఉండబట్టే తారక్ ప్రాణాలతో వచ్చాడన్నారు. తనకు ఇప్పటికీ ఎప్పటికీ తారక్ ప్రియస్నేహితుడే అని అన్నారు.