‘శ్యామ్ సింగరాయ్ 2’ పై డైరెక్టర్ క్లారిటీ..ఈసారి పవన్ కళ్యాణ్ తో..!

Director Clarity on 'Shyam Singarai 2' .. this time with Pawan Kalyan ..!

0
118

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. శుక్రవారం థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. వి, టక్‌ జగదీష్‌ తర్వాత థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించగా.. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్. కొన్ని సన్నివేశాలకు ఆశించిన స్థాయి కంటే ఎక్కువ క్లాప్స్ పడుతుండడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. అలాగే తన మనసులోని కోరికను బయటపెట్టాడు.

పవన్ కళ్యాణ్‏‏తో సినిమా చేయాలని ఉందని తన కోరికను బయటపెట్టాడు. పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. సహజంగానే ఆయనలో ఒక ఫైర్ ఉంటుంది. అలాంటి స్టార్ హీరోతో పవర్ఫుల్ స్టోరీ చేస్తే థియేటర్స్ పగిలిపోతాయి. ఆ రేంజ్ ఫ్యాన్ బేస్ ఆయనకు ఉంది. ఆయన ఒప్పుకోవాలేగానీ శ్యామ్ సింగరాయ్ 2 ఆయనతో చేస్తాను. అలాంటి పవర్ఫుల్ పాత్రలలోనే ఆయనను చూడటానికి అభిమానులు ఆసక్తిని చూపితుంటారు అని చెప్పాడు.