తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసుపై టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(RGV) స్పందించారు. ఈ ఇష్యూపై ఆదివారం సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘నిహారిక అనే యువతి కోసం.. హరిహరకృష్ణ అనే అబ్బాయి నవీన్ అనే తన స్నేహితున్ని కిరాతకంగా చంపాడు. ప్రేమ గుడ్డిదని తెలుసు.. కానీ మరీ ఇంత గుడ్డిదని మాత్రం నాకు తెలియదు.’ అంటూ సెటైరికల్‌గా స్పందించాడు. దీంతో నెటిజన్లు ఆర్జీవీపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ ఇష్యూపై ట్రైయాంగిల్ క్రైం లవ్ స్టోరీని సినిమా తీయాలంటూ సూచిస్తున్నారు. ఆర్య-3గా టైటిల్ పెట్టి హీరోయిన్‌గా మాత్రం నిహారికను సెలెక్ట్ చేయాలని మరో వ్యక్తి ఆర్జీవీ(RGV)కి సూచించాడు. మరికొందరు యువకుడు చనిపోయి కుటుంబంలో విషాదం నెలకొన్న సమయంలో ఇలాంటి సినిమాలు చేయడం మంచిదికాదని అంటున్నారు.
Read Also: ఎదురుచూస్తోన్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ.. రేపు ఏం జరుగబోతోంది!
Follow us on: Google News