‘బ్రహ్మాస్త్ర’ తొలి రోజు కలెక్షన్లు ఎంతో తెలుసా?

0
104

స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కిన సినిమా బ్రహ్మాస్త్ర. బాలీవుడ్, టాలీవుడ్ పాపులర్ నటులు రణబీర్ అలియా భట్, అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున ప్రధాన తారాగణంతో దర్శకుడు ఆయున్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా రెండు భాగాలుగా  తెరకెక్కుతుండగా..మొదటి భాగం బ్రహ్మాస్త్ర శివ’ పేరుతో విడుదల చేశారు. నిన్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది.

కాగా ఈ చిత్రానికి 20 కోట్ల వసూళ్లు వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. ఇందులో తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్ కోటిపైనే ఉండటం గమనార్హం. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాల అంచనా ప్రకారం తొలి రోజు ఈ చిత్రం అన్ని భాషల్లో కలిపి రూ. 36 కోట్ల వసూళ్లు రాబట్టింది. సెలవు కాని రోజున విడుదలైన హిందీ ఒరిజినల్ చిత్రానికి వచ్చిన మొదటి రోజు కలెక్షన్స్ లో ఇదే అత్యధికం కావడం విశేషం. దాంతో, విడుదలతోనే ‘బ్రహ్మాస్త్ర’ కొత్త రికార్డును సృష్టించింది.

అమెరికాలోనూ ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. తొలి రోజు యూఎస్ ఏ బాక్సిఫీస్ వద్ద ఈ చిత్రం ఒక మిలియన్ డాలర్లు (రూ. ఏడు కోట్లపైనే) సంపాదించినట్టు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని రూ. 400 కోట్ల బడ్జెట్తో నిర్మించారు.