మహేష్ బాబు(Mahesh Babu) అభిమానులకు గుడ్ న్యూస్. ‘గుంటూరు కారం'(Guntur Kaaram) ఫస్ట్ సింగిల్ అప్టేట్ వచ్చేసింది. ఈ సినిమాలోని ‘దమ్ మసాలా’ పాట ప్రోమోను రేపు (ఆదివారం) ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. పూర్తి పాటను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 7న విడుదల చేస్తారని.. ఈ మేరకు రేపు విడుదల కానున్న సాంగ్ ప్రోమోలో వెల్లడించనున్నారని తెలుస్తోంది. దీంతో మహేష్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.
అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్-త్రివిక్రమ్(Trivikram) కలయికలో వస్తున్న మూడో సినిమా కావడంతో ‘గుంటూరు కారం(Guntur Kaaram)’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లే గతంలో విడుదలైన టీజర్, పోసర్లు సినిమాపై హైప్ పెంచేశాయి. ఇందులో మహేష్.. మాస్ అవతారంలో రచ్చ చేయనున్నాడట. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తు్ండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ మూవీ విడుదల కానుంది.