గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan) హీరోగా ‘గేమ్ ఛేంజర్(Game Changer)’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్(Shankar) దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్‌నగర్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా మ్యూజిక్ హక్కుల్ని ప్రముఖ ఆడియో కంపెనీ ‘సరేగమ(Saregama)’ రూ.33కోట్లకు సొంతం చేసుకుందని టాక్ నడుస్తోంది. ఇంతవరకు ఈ చిత్రం నుంచి ఒక్క పాట కూడా బయటకు రాలేదు. కానీ ఇంత మొత్తంలో చెల్లించడానికి ఆడియో సంస్థ ముందుకు రావడం ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ను తెలియజేస్తుందని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా చిత్రాల్లో ఆడియో రైట్స్‌కు ఇంత భారీ ధర ఈ చిత్రానికే పలికిందంటున్నారు.
RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత చరణ్ సోలో హీరోగా నటిస్తున్న సినిమా కావటంతో గేమ్ ఛేంజర్(Game Changer)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. శంకర్(Director Shankar) సినిమాల్లో పాటలకు ప్రత్యేకత ఉంటుంది. సౌత్ ఇండియాలో పాటలకు భారీతనం తీసుకొచ్చిందే శంకర్ అని తెలిసిందే. ఆయన తెరకెక్కించే పాటలు చాలా రిచ్‌గా ఉంటాయి. సెట్టింగ్స్, విజువల్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ప్రస్తుతం సంగీత దర్శకుడు తమన్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆయన ఇటీవల అందించిన అన్ని సినిమాల పాటలు ఓ ఊపు ఊపేస్తున్నాయి. చెర్రీ, శంకర్ కాంబో.. థమన్ సంగీతం.. ఈ కారణాలతోనే ఆడియో రైట్స్ అంత ధర పలికాయని భోగట్టా.
ఇక మూవీ విషయానికొస్తే ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కియారా అడ్వాణీ మరోసారి హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.