ఈ కరోనా సమయంలో గత ఏడాది నుంచి ఆన్ లైన్ లోనే విద్యాబోధన జరిగింది. దీంతో ఇంట్లోనే విద్యార్దులకి ఆన్ లైన్ తరగతుల్లో భోదిస్తున్నారు, టీచర్లు కూడా ఇంటి నుంచి పాఠాలు చెబుతున్నారు, అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఓ విద్యార్థికి ఆన్ లైన్ లో పాఠాలు చెప్పిన పంతులమ్మ ఆపై జూమ్ కాల్ ఆఫ్ చేయడం మర్చిపోయింది. ఇక ఆ తర్వాత ఏమైంది అంటే, ఆమె ఇష్టం వచ్చిన రీతిన మాటలు మాట్లాడింది..ఆ విద్యార్థి కుటుంబంపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసింది, చివరకు ఉన్న ఉద్యోగం కోల్పోయింది.
పామ్ డేల్ స్కూల్లో కింబర్లీ న్యూమన్ అనే మహిళ సైన్స్ టీచర్ గా పనిచేస్తుంది..కింబర్లీ న్యూమన్ జూమ్ కాల్ ద్వారా ఓ విద్యార్థి డౌట్లకు ఆన్ లైన్ లో క్లారిటీ ఇచ్చింది…క్లాసు అయిన తర్వాత జూమ్ వీడియో కాల్ ఆఫ్ చేయడం మర్చిపోయింది.
విద్యార్ది స్టోక్స్ కుటుంబంపై ఇష్టం వచ్చినట్టుగా వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసింది. ఆ అబ్బాయి నల్లజాతీయుడని, తల్లీకొడుకులు ఇద్దరూ సోమరిపోతులని వారికి పిల్లలను పెంచడం చేతకాదంది.
పేరెంట్స్ ఆ కాల్ ను రికార్డు చేశారు. దాంతో కింబర్లీ న్యూమన్ చేసిన జాతివ్యతిరేక వ్యాఖ్యలన్నీ రికార్డయ్యాయి. చివరకు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఆమెపై కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారట. ఆమెని ఉద్యోగం నుంచి తొలగించారు.