2020 భవిష్యవాణి బాబా వెంగా ఏం చెప్పారో వినండి

2020 భవిష్యవాణి బాబా వెంగా ఏం చెప్పారో వినండి

0
101

మన దేశంలోనే కాదు బాబాలని చాలా దేశాల్లో నమ్ముతారు, వారు చెప్పే సిద్దాంతాలు చాలా మంది పాటిస్తారు, మన దేశంలోనే ఈ అలవాటు అనుకుంటే ఇతర దేశాల్లో కూడా ఇలాంటి మంత్రాలు బాబాలకు మంచి ఫేమ్ ఉంది, తాజాగా బల్గేరియాకు చెందిన భవిష్యవక్త బాబా వెంగా ఆయన చాలా ఫేమస్
2020 సంవత్సరానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ముందుగానే వెల్లడించారు. మరి ఆయన ఏం చెప్పారో చూద్దాం.

బాబా వెంగా అసలు పేరు వెంగోలియా పాండేవ్ దిమిత్రోవా. 1911లో అతను జన్మించారు. 1966లో మృతి చెందారు. 12 ఏళ్ల వయసులో బాబా వెంగా తన కంటి చూపును కోల్పోయారు. తరువాత ఆయన తనకు భగవంతుడు ముందుగానే భవిష్యత్ను సందర్శించే శక్తినిచ్చాడని చెప్పుకొచ్చారు.
అలా అన్ని విషయాలు భవిష్యత్తులో జరగబోయేవి చెప్పేవారు.

యూరప్ లో రసాయన దాడులు పెరుగుతాయట
ముస్లింలకు బాధలు వస్తాయి వారి గళం విప్పుతారు ప్రపంచ వ్యాప్తంగా
రష్యా అధ్యక్షుడు పుతిన్కు ప్రాణహాని ఉంటుందట
డొనాల్డ్ ట్రంప్ వ్యాధుల బారిన పడతారట
మత కల్లోలాలకు ఆస్కారం ఉంటుందట
పెట్రోలు ఉత్పత్తులు తగ్గుముఖం పడతాయట.
డబ్బు విలువ కొన్ని దేశాల్లో మరి దిగజారిపోతుందట… అయితే వచ్చే ఏడాది అంత బాగాలేదు అని 2020 అనుకోని సంఘటనలతో ఆపదలతో నడుస్తుంది అని మొత్తానికి తెలుస్తోంది. అయితే కొందరు దీనిని నమ్ముతారు మరికొందరు దీనిని పెద్ద పట్టించుకోవడం లేదు.