అతని వెంట పడుతున్న 25 మంది అమ్మాయిలు అతనిలో స్పెషాలిటి ఇదే

అతని వెంట పడుతున్న 25 మంది అమ్మాయిలు అతనిలో స్పెషాలిటి ఇదే

0
99

చాలా మంది ఒంటరి జీవితం ఉండలేరు.. దీని కోసం తమ లైఫ్ పార్టనర్ ని ఎంచుకోవాలి అని చూస్తారు, అయితే ఇలాగే వాలెంటైన్స్ డే దగ్గరకు వస్తున్న సమయంలో ఓ యువకుడు చేసిన పనికి పెద్ద ఎత్తున అమ్మాయిలు అతని వెంట పడుతున్నారు .. గాళ్ ఫ్రెండ్ గా మేము ఉంటాము అని అతని వెంట పడుతున్నారు, మరి అతను ఏం చేశాడంటే.

ఇంగ్లాండ్కు చెందిన మార్క్ రొఫే గురించి తెలుసుకోవాల్సిందే. మార్క్ రొఫే స్నేహితుల్లో కొందరు వివాహం చేసుకున్నారు. మరికొందరు తమ గర్ల్ఫ్రెండ్స్తో రిలేషన్లో ఉన్నారు. అందుకే వారిలా తనకి తోడు కావాలి అని అనుకున్నాడు, అమ్మాయిలని చాలా మందిని కలిశాడు, తన అభిరుచులు చెప్పాడు, వారి గురించి తెలుసుకున్నాడు.

నెల రోజులు అయినా తనకి సరైన జోడి దొరకలేదు.. ఇప్పుడు వాలెంటైన్స్ డే నాటికి తనకు కూడా ఓ గర్ల్ఫ్రెండ్ కావాలని గట్టిగా అనుకున్నాడు. ప్రముఖ డేటింగ్ యాప్లలో గర్ల్ఫ్రెండ్ కోసం వెతుకులాట కొనసాగిస్తూనే.. మరో పక్క డేటింగ్ కోసం నాకొక సింగిల్ కావాలంటూ మాంచెస్టర్ సెంటర్లో ఓ పెద్ద హోర్డింగ్పై ప్రకటన ఇచ్చేశాడు. అలాగే డేటింగ్ మార్క్ అనే వెబ్ సైట్ కూడా పెట్టాడు దీని నుంచి అతనికి చాలా ప్రపోజల్స్ వచ్చాయి,దాదాపు 25 మంది అమ్మాయిలు అతనితో డేట్ కి వస్తాము అని కాల్ చేస్తున్నారాట,