300 కోట్ల భవనం ఉచితంగా ఇచ్చేశారు అక్కడ ఏం చేస్తారో తెలిస్తే షాక్

300 కోట్ల భవనం ఉచితంగా ఇచ్చేశారు అక్కడ ఏం చేస్తారో తెలిస్తే షాక్

0
93

ఈ రోజుల్లో మన సొమ్ము రూపాయి పోతుంది అంటే బాధపడేవారు చాలా మంది ఉంటారు.. అలాంటిది 300 కోట్ల రూపాయల విలువైన స్ధలం ఉచితంగా ఇస్తున్నారు అంటే అంబానీలు టాటాలు సైతం నిజంగా ఆశ్చర్యపోతారు.. వారికంటే వీరు దాతృత్వానికి అసలైన వ్యక్తులు అనే చెబుతారు ఎవరైనా.

బెంగళూరుకు చెందిన మీరానాయుడుకు మెజస్టిక్ ప్రయాణ ప్రాంగణం సమీపం గాంధీనగర్‌లో విశాలమైన స్థలం ఉంది, అందులో మూడు అంతస్తుల భవనం ఉంది. ఇది ఒకప్పుడు చిన్నపాటి హెటల్. దీని విలువ ప్రస్తుత మార్కెట్లో రూ.300 కోట్ల పైమాటే, చాలా మంది రియల్టర్లు ఇది కావాలి అని అడిగారు.. సుమారు 300 కోట్లు ధర పలికింది.. కాని మీరానాయుడికి బోలెడు ఆస్తి ఉంది.. అమ్మితే మరో 300 కోట్లు అధనంగా వస్తుంది.. అంతేకదా కాని పేదలకు సేవ చేయాలి అనే ఆలోచనలో మీరా నాయుడు ఆ భవనం అమ్మడం లేదు.

ఆ భవనాన్ని, స్థలాన్ని క్యాన్సర్ పీడిత బాలల ఆరోగ్య కేంద్రానికి అప్పగించారు.నగరంలోని శంకర్ ఆసుపత్రి క్యాన్సర్ పీడితులకు ఉచితంగా క్యాన్సర్ చికిత్స అందిస్తోంది. తన కోట్ల విలువైన భవనాన్ని ఆ ఆసుపత్రి నిర్వాహకులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ మూడు అంతస్తుల భవనంలో 32 గదులు ఉన్నాయి. ప్రతి అంతస్తులో కొత్తగా వంటశాల నిర్మిస్తారు. అక్కడ చికిత్స కోసం వచ్చే పిల్లల కుటుంబాలు ఇక్కడ ఉంటాయి.. వారికి ఉచితంగా ఆశ్రయం ఇస్తారట, మొత్తం అందంగా ఆ సముదాయం మారుస్తున్నారు, సకల సౌకర్యాలు అక్కడ కల్పించనున్నారట, నిజంగా వారిది ఎంత గొప్ప మనసు.