మన ప్రపంచంలో అనేక జాతులు మతాలు కులాలు ఉన్నాయి, ఒక్కో సంప్రదాయం ఒక్కొక్కరు పాటిస్తారు, అయితే వివాహం జరిగే సమయంలో వారి మతాలు ఆచారాలు సంప్రదాయం ప్రకారం జరుగుతాయి..దక్షిణ సూడన్‌లో పాటించే పెళ్లి సాంప్రదాయాల గురించి తెలిస్తే మతిపోవడం ఖాయం.
సంతలో పసువును అమ్మినట్లుగా ఇక్కడ అమ్మాయిలను వేలానికి పెడతారు. నగదు లేదా గోవులు, విలువైన వస్తువులను ఇవ్వడం ద్వారా వధువును గెలుచుకోవాలి. తాజాగా ఓ వ్యాపార వేత్త 400 ఆవులు100 బర్రెలు, మూడు కార్లు మన రూపాయల్లో 1 లక్ష కట్నం ఇచ్చి 17 ఏళ్ల యువతిని కొనుగోలు చేసి పెళ్లి చేసుకున్నాడు.
అయితే నగదు ఎవరు ఎక్కువ ఇస్తే వారికి ఇచ్చి ఇలా వివాహం చేస్తారు, అంతేకాదు ఆమె ఈ వివాహం చేసుకోను అనడానికి ఉండదు, ఆమెపై హక్కులు అన్నీ ఆమె తండ్రికి ఉంటాయి కాబట్టి అతను ఎవరిని వివాహం చేసుకోమంటే వారిని చేసుకోవాల్సిందే.