సాయిబాబా గుడికి బిచ్చగాడు 8 లక్షల విరాళం. అతని స్టోరీ వింటే మతిపోతుంది

సాయిబాబా గుడికి బిచ్చగాడు 8 లక్షల విరాళం. అతని స్టోరీ వింటే మతిపోతుంది

0
99

ఇటీవల చాలా మంది బిచ్చగాళ్లని చూస్తుంటే కోటీశ్వరులుగా కనిపిస్తున్నారు.. పాపం యాచించి సంపాదించిన దానితో జీవితంలో అందంగా బతకక కూడబెట్టి దానిని ఖర్చు చేయకుండానే చనిపోతున్నారు. కాని ఓ బిచ్చగాడు తాజాగా చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు, ఓ బిచ్చగాడు ఆలయాల ముందు బిచ్చం ఎత్తుకుంటూ బతుకుతున్నాడు.

అలా రోజూ వచ్చే డబ్బులన్నీ పోగేస్తూ.. మళ్లీ గుడులకే విరాళంగా ఇస్తున్నాడు. అలా తనకు నిలువనీడనిచ్చిన సాయిబాబా ఆలయానికి కొన్నేళ్లలో 8 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చాడు.. నిజానికి అతను ఒకప్పుడు రిక్షా లాగుతూ బతికేవాడు. మోకాలి చిప్పలు అరిగిపోయి, రిక్షా తొక్కలేని పరిస్థితి రావడంతో గుడుల ముందు భిక్షమెత్తుకోవడం మొదలుపెట్టాడు. ఇలా తన జీవితం గడుపుతున్నాడు.

అలా వచ్చిన డబ్బులు తను నిత్య అవసరాలు తీర్చకుని మిగిలినవి పోగు చేశాడు.. ఇలా ముందు గుడికి లక్ష విరాళం ఇచ్చాడు తర్వాత తను సంపాదించిన డబ్బు అంతా ఇలా విరాళంగా ఇచ్చాడు, ఈ విషయం తెలిసిన వారు ఇంకా నాకు డబ్బులు బాగా బిచ్చం వేస్తున్నారు అని చెప్పాడు. ఇప్పుడు అతని వయసు 70 ఏళ్లు. అయితే సాయిబాబా గుడికే కాదు ఇంకా చాలా దేవాలయాలకు విరాళాలు ఇచ్చాను అని చెబుతున్నాడు, నిజమే అతనిది ఎంత మంచి మనసు.