పంజాబ్ లోని ఈ కుటుంబం జనవరిలో ఎంతో సంతోషంగా మనవడి పుట్టిన రోజు చేశారు, దాదాపు 500 మందిని పిలిచి పార్టీ ఇచ్చారు, ఆర్మీలో పని చేసే అతను తన కుమార్తె పుట్టిన రోజు కోసం వచ్చి పార్టీ ఇచ్చాడు, తాతయ్య నాన్న నానమ్మ అమ్మ అందరూ అతని పుట్టిన రోజు ఘనంగా చేశారు, ఈ లాక్ డౌన్ వేళ ఆర్మీ జవాను ఇంట విషాదం జరిగింది.
జవాన్ కుటుంబం అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమారుడిని నాగుపాము కాటు వేయడంతో ప్రాణాలు వదిలాడు, ఇది ఆ కుటుంబాన్నీ తీవ్రంగా కలిచివేసింది, సరదాగా ఆటలాడుకుంటున్న ఆ చిన్నోడు ఇంటి గార్డెన్ లో ఉన్నాడు, ఈ సమయంలో అతనిని పాము కరిచింది.
కాని ఎవరూ చూడలేదు, తర్వాత నోటి నుంచి నురగలు రావడం చూసి ఆస్పత్రికి తీసుకువెళ్లారు, పిల్లాడిని పాము కరిచింది అని చనిపోయాడు అని చెప్పారు, దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరు అయింది, నిజంగా ఇంతలాంటి దారుణం మరెక్కడా జరగకూడదు అని అందరూ కోరుకున్నారు, తండ్రి పాపం డ్యూటీలో ఉండిపోయారు. లాక్ డౌన్ తో రావడానికి లేకుండా పోయింది.