సోషల్ మీడియా వీడియో దిగ్గజం యూ ట్యూబ్ అంటే తెలియని వారు ఉండరు… ప్రపంచంలో ఎక్కువ మంది దాదాపు 40 శాతం మంది యూట్యూబ్ వాడుతున్నవారే.. 500 కోట్ల వీడియోలు నిత్యం చూస్తున్నవారే, అయితే ఇందులో ఏది నిజం ఏది అవాస్తవం అనేది కూడా తెలియడం లేదు..
కుప్పలు తెప్పలుగా ఛానెల్స్ పుట్టుకురావడంతో అసలు ఏది నిజం అనేది చాలా మందికి తెలియడం లేదు, అంతేకాదు ఓరిజినల్ కంటెంట్ కూడా మిస్ అవుతోంది అనేది చాలా మంది చెబుతున్న మాట. అందుకే కీలక నిర్ణయం తీసుకుంది యూ ట్యూబ్, నిరాధార వార్తలను అరికట్టేందుకు, ఏ విధమైన ఎన్నికలు జరిగినా, వాటికి సంబంధించిన తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేయడాన్ని నిషేధించనున్నట్లు ప్రకటించింది.
ప్రభుత్వ ఉద్యోగులు మృతి చెందారని లేదా, ఎన్నికల తేదీల వ్యవహారంలో తప్పుడు సమాచారం గానీ పోస్ట్ చేస్తే, దాన్ని వెంటనే తొలగిస్తామని గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది. అసత్య వార్తలు పోస్ట్ చేసిన వెంటనే అవి డిలీట్ అవుతాయని దీని కోసం ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్ లు ఏర్పాటు చేశాము అని తెలిపింది, వీరు ప్రతీ వీడియోలు పరిశీలిస్తారు అని తెలిపింది యూ ట్యూబ్.