ఆ ఇంట్లో కోతులు భారీ దోపిడీ చివరకు ఏం చేశాయంటే

ఆ ఇంట్లో కోతులు భారీ దోపిడీ చివరకు ఏం చేశాయంటే

0
127

కోతులని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు, అవి తినే ఆహారం అనుకుని విలువైన వస్తువులు కూడా తీసుకుపోయిన సందర్భాలు ఉన్నాయి, బంగారం సెల్ ఫోన్లు బ్యాగులు ఇలా చాలా వస్తువులు తీసుకుపోయిన ఘటనలు ఉన్నాయి.

చివరకు అవి ఎక్కడో ఓ చోటున పాడేస్తాయి, కాని ఇక్కడ కోతులు ఓ ఓ బామ్మ కష్టపడి దాచుకున్న సొమ్మంతా తీసుకుపోయాయి. ఆమె ఇంట్లో లేని సమయం చూసి ఇంట్లో ఉన్న వస్తువులు, బంగారం, నగదు, తినుబండారాలతో వానరాలు పారిపోయాయి.

దీంతో వచ్చి చూసేసరికి ఆమె షాక్ అయింది, ఇది తమిళనాడులో జరిగింది, ఆమె పూరి గుడిసెలో ఉంటోంది, ఈ సమయంలో ఆమె సంపాదించిన డబ్బు బంగారం ఇంట్లో పెట్టి బట్టలు ఉతికేందుకు బయటకు వెళ్లింది, సుమారు 25 వేల నగదు బంగారం బియ్యపు సంచిలో దాచుకుంది..ఈ సమయంలో గుడిసెలోకి కోతులు వచ్చాయి. మొత్తం పట్టుకుని పారిపోయాయి, ఆమె స్ధానికుల సాయంతో అంతా వెతికినా నగదు బంగారం దొరకలేదు.