ఏసీలో 40 పాము పిల్లలు చివరకు ఏం చేశారంటే

ఏసీలో 40 పాము పిల్లలు చివరకు ఏం చేశారంటే

0
128

చల్లటి ప్రాంతాలు ఉంటే చాలు అక్కడ పాములు తిష్టవేస్తాయి అనేది తెలిసిందే, ఇది నమ్మాల్సిన విషయం, అందుకే చల్లని మట్టి దగ్గర తుంపలు కంపల దగ్గర అవి చాటున ఉంటాయి, అయితే ఇప్పుడు ప్రతీ ఒక్కరి ఇంటిలో ఏసీ ఉంటోంది అక్కడ కూడా ఈ పాములు తిష్ట వేస్తున్నాయి, ఆ చల్లదనానికి ఆ పాములు ఏసీలో ఉంటున్నాయి

తాజాగా ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఉన్న ఎయిర్ కండిషనర్(ఏసీ) పైపులోకి ఏకంగా 40 పాము పిల్లలు చేరాయి. పైన ఫ్లోర్ మీద ఓ పాముని చూసి రైతు షాక్ అయ్యాడు , వెంటనే ఏసీ నుంచి పాములు బయటకు రావడం చూశాడు, మంచంపై మరో మూడు ఉన్నాయి, దీంతో వెంటనే ఏసీ ఆఫ్ చేశాడు

లోపల చూస్తే షాక్ ఏకంగా 40 పాము పిల్లలు ఉన్నాయి, వెంటనే ఏసీ పైపును కోసి బయటికి తెచ్చారు. ఆ తరువాత పాములను అన్నింటిని తీసి ఒక గొనె సంచిలో వేసి దగ్గరలో ఉన్న అడవిలో వదిలేసి వచ్చాడు. ఓ పెద్ద పాము అందులో గుడ్లు పెట్టి ఉంటుంది అని అందుకే ఇలా పాములు బయటపడ్డాయని అంటున్నారు వైద్యులు.