మెగా హీరో సినిమాలో సునీల్ టాలీవుడ్ టాక్ ?

Actor Sunil in the mega star chiranjivee movie

0
149

టాలీవుడ్ లో కమెడియన్స్ లో బ్రహ్మనందం, అలీ తర్వాత అంత పేరు సంపాదించుకున్నారు సునీల్. ఓ పక్క కమెడియన్ గా మరో పక్క హీరోగా కూడా చేస్తున్నారు. ఇప్పుడు విలన్ పాత్రలు చేస్తున్నారు ఇక మళ్లీ అగ్ర హీరోల సినిమాల్లో సునీల్ కొత్త పాత్రలు చేస్తున్నారు. పుష్ప సినిమాలో కూడా ఒక నెగిటివ్ పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తాజాగా సునీల్ మెగా సినిమాలో నటించనున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి టాలీవుడ్ లో. అది ఏ సినిమా అంటే టాలీవుడ్ వార్తల ప్రకారం రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. ఈ చిత్రంలో చరణ్ పక్కన స్నేహితుడిగా ఓ పాత్ర ఉంటుంది అని తెలుస్తోంది. దీని కోసం సునీల్ ని పరిశీలిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి దీనిపై ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్.

ఈ వార్త అయితే వినిపిస్తోంది. ఇక చరణ్ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. ఈ సినిమాపై చరణ్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సరికొత్త కథతో శంకర్ చరణ్ ని చూపించనున్నారట.