అది ల‌క్ అంటే – ఇలా అదృష్టం రావాలి – భ‌లే జాక్ పాట్ కొట్టాడు

అది ల‌క్ అంటే - ఇలా అదృష్టం రావాలి - భ‌లే జాక్ పాట్ కొట్టాడు

0
122

ఆ ల‌క్ష్మీ క‌టాక్షం ఎప్పుడు ఎవ‌రికి ఎలా వ‌స్తుందో తెలియ‌దు… పేద‌వాడిని కూడా కుబేరుడ్ని చేస్తుంది.. కాలం క‌లిసిరావాలి అంటారు, అందుకే తాజాగా ఓ వ్య‌క్తి కేర‌ళ నుంచి పొట్టకూటి కోసం వేరే దేశానికి వెళ్లాడు.. ప‌ని చేసే స‌మ‌యంలో అత‌నికి లాట‌రీ రూపంలో అదృష్ట లక్ష్మి వరించింది.

కేరళకు చెందిన దిలీప్ కుమార్ ఎల్లికొట్టిల్ పరమేశ్వరన్ బతుకుదెరువు కోసం యూఏఈలోని అజ్మన్ కు వెళ్లాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. త‌న కుటుంబం కోసం ఏడు సంవ‌త్స‌రాలుగా అక్క‌డే క‌ష్ట‌ప‌డుతున్నారు, అక్క‌డ ఆటో స్పేర్ పార్ట్స్ కంపెనీలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు.

అయితే అత‌నికి లాట‌రీ కొనే అల‌వాటు కూడా ఉంది ..దీంతో అత‌ను ఈ నెల ఏప్రిల్ 14న ఆన్ లైన్ లో ఆయన లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు… నిన్న తీసిన లక్కీ డ్రాలో జాక్ పాట్ కొట్టాడు. ఏకంగా రూ. 20.63 కోట్లు గెలుచుకున్నాడు. ఒక్క‌సారిగా త‌న‌కు లాట‌రీ త‌గిలింది అని తెలిసి షాక్ అయ్యాను, నా జీవితంలో ఇది మ‌రిచిపోలేని రోజు నా ఇబ్బందులు అన్నీ తిరిపోతాయి, మంచి వ్యాపారం పెట్టుకుంటాను అని చెబుతున్నాడు పరమేశ్వరన్ , అలాగే పిల్ల‌ల‌కు మంచి చ‌దువు చెప్పిస్తాను అని చెప్పాడు మీడియాకి.