అదృష్టంగా లాటరీ వచ్చింది తర్వాత రోజు దురదృష్టం అతని తలుపు తట్టింది.

అదృష్టంగా లాటరీ వచ్చింది తర్వాత రోజు దురదృష్టం అతని తలుపు తట్టింది.

0
101

అతని ఇంటికి అదృష్టం తలుపు తట్టింది, ఈ సమయంలో అతని దురదృష్టం కూడా పలకరించింది..పాపం అదృష్టం కంటే ఆ దురదృష్టానికి అతను బలైపోయాడు.. విధి ఆ కుటుంబంతో ఆడుకుంది అని చెప్పాలి, కేరళలో చిన్న దుకాణం నడుపుతున్న ఓ వ్యక్తి తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు, ఈ సమయంలో అతను కొన్ని లాటరీ టిక్కెట్లు అమ్మాడు.. దాదాపు 200 టిక్కెట్లు అమ్మాడు. చివరగా 10 టిక్కెట్లు మిగిలాయి.

ఓ రోజు అతని దగ్గర ఉన్న టికెట్ కు 60 లక్షల లాటరీ తగిలింది. దీంతో ఎంతో ఆనందించాడు, ఈ సమయలో తన బాకీలు తీర్చవచ్చు మంచి ఇళ్లు కట్టుకుని షాపు పెద్దది చేయాలి అని అనుకున్నాడు.. కాని అతని ఆశలు ఆవిరి అయ్యాయి, అతను లాటరీ డబ్బుల కోసం బ్యాంకుకు వెళ్లాడు.. ఈ సమయంలో బ్యాంకు అధికారులతో మాట్లాడుతున్న సమయంలో అతనికి ఛాతీ నొప్పి వచ్చింది.

వెంటనే అక్కడికక్కడ కూలపడిపోయాడు.. అలా కింద పడి ప్రాణాలు వదిలాడు.. దీంతో అక్కడ అందరూ షాక్ అయ్యారు..పాపం మంచి రోజులు వచ్చాయి అనుకునే లోపు ఆ ఆనందం కొద్ది రోజులు కూడా లేదు అని అన్నారు.. చివరకు ఆ లాటరీ డబ్బులు అతని కుటుంబానికి సంస్ద అందించింది,