అదృష్ట‌వంతుడు మ‌న‌దేశంలో నిరుపేద‌కు దొరికిన 3 వ‌జ్రాలు – ఖ‌రీదు ఎంతంటే

అదృష్ట‌వంతుడు మ‌న‌దేశంలో నిరుపేద‌కు దొరికిన 3 వ‌జ్రాలు - ఖ‌రీదు ఎంతంటే

0
109

ఈ మ‌ధ్య మ‌నం కొంద‌రు గ‌నిలో ప‌నిచేస్తున్న వారికి య‌జ‌మానుల‌కి వ‌జ్రాలు ర‌త్నాలు దొర‌క‌డం గురించి విన్నాం, ఏకంగా ఈ నెల‌లో న‌లుగురికి ఇలాంటి విలువైన రాత్నాలు దొరికాయి, అయితే తాజాగా మ‌న దేశంలో కూడా ఇలా ఓ వ‌జ్రం దొరికింది ..కోట్లు కాక‌పోయినా లక్షల రూపాయ‌లు ధ‌ర ప‌లికింది.

ఇంత‌కీ రాత్రికి రాత్రే ఆ వ్య‌క్తిని కోటీశ్వ‌రుడిని చేసింది మ‌రి ఎక్క‌డ అనేది చూద్దాం.
మధ్య ప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ప్రాంతంలో కొద్ది రోజుల క్రితం గనుల్లో ఓ కార్మికుడికి 10 క్యారెట్లకు పైగా విలువైన వజ్రాలు లభించిన సంగతి తెల్సిందే. తాజాగా పన్నా జిల్లాలోని ఓ గనిలో పనిచేస్తున్న సిబాల్ అనే కార్మికుడికి 7.5 క్యారెట్ల మూడు వజ్రాలు దొరికాయి.

అక్క‌డ డైమెండ్ ఆఫీస‌ర్ ఇది నిజ‌మే అని తెలియ‌చేశారు, ఈ వ‌జ్రాల విలువ మొత్తం సుమారు 36 లక్షల వ‌ర‌కూ వ‌చ్చే అవ‌కాశం ఉంది అని తెలిపారు. అయితే వీటిని వేలం వేస్తారు, ఇందులో వ‌చ్చిన న‌గ‌దులో 12 శాతం ప‌న్ను తీసుకుని మిగిలిన 88 శాతం అత‌నికి చెక్ రూపంలో అంద‌చేస్తారు.