అక్కడ చీమలతో కుట్టించుకుంటేనే వివాహం – వింత ఆచారం

అక్కడ చీమలతో కుట్టించుకుంటేనే వివాహం - వింత ఆచారం

0
94

ప్రపంచంలో ఎన్నో జాతులు ఉన్నాయి, అనేక రకాల తెగలు ఉన్నాయి, ఇక ఎవరి ఆచారాలు వారివి ఎవరి నమ్మకాలు వారివి, అయితే కొన్ని కొన్ని ఆచారాలు చాలా వింతగా ఉంటాయి, నిజంగా ఇలాంటి ఆచారాలు ఎప్పుడూ విని ఉండం. మరి ఇక్కడ వివాహాల విషయంలో ఆచారాలు వింటే మతిపతుంది.

అమెజాన్ ప్రాంతాల్లో గిరిజన తెగల ఆచారం ఇది. ఇక్కడ పెళ్లి చేసుకునే యువకుడు కచ్చితంగా కండ చీమలతో కుట్టించుకోవాలి, ఇక్కడ వీటిని ఎర్ర బెలిట్ చీమలు అంటారు, చేతికి తోడుగు వేసే చిన్న క్లాత్ లో ఈ చీమలు వేస్తారు. అందులో చేతులు పది నిమిషాలు ఉంచుకోవాలి, ఇలా బాధలు భరిస్తే జీవితంలో ఏ బాధ వచ్చినా ఎదిరించి ఉంటారు అని నమ్మకంతో ఇలా చేస్తారు.

అయితే ఎవరైనా ఆ సమయంలో చేతి వేళ్లు వెంటనే ఆ క్లాత్ దాని నుంచి తీసేస్తే ఆ వివాహం జరుగదు, ఇక మరోసారి ప్రయత్నించాలి అని అనుకున్నా కుదరదు, ఇక్కడ ఆచారం ఇది, ఇక ఆ అమ్మాయి అతనిని వివాహం చేసుకోదు, అందుకే అబ్బాయిలు ఎంత బాధ ఉన్నా భరించి వివాహం చేసుకుంటారు.