అక్షయపాత్ర సాయంతో ధర్మరాజు వేలాదిమందికి భోజనం పెట్టాడు ఎలాగో తెలుసా

అక్షయపాత్ర సాయంతో ధర్మరాజు వేలాదిమందికి భోజనం పెట్టాడు ఎలాగో తెలుసా

0
96

పాండవులు అరణ్యానికి బయలు దేరి ఉత్తర దిక్కుగా పయాణం చేస్తూ ఉంటారు… వారి వెనుక సేనలు బ్రాహ్మణులు వారిపై నమ్మకం ఉన్నవారు పోషకులు అందరూ కూడా అలాగే నడుస్తారు. ఇక జనం కూడా కన్నీరు పెడతారు, పాండవులకి ఏమి ఈ కష్టం అని రోధిస్తారు ఆ పురజనం. పాండవుల వెంట చాలా మంది వేల మంది ఆనాడు వారితో అరణ్యానికి వెళతారు.

ధర్మరాజు వారిని అందరిని రావద్దు అని కోరాడు, కొందరు వెనక్కి వెళ్లిపోయారు, మరికొందరు వారి వెంట నడిచారు..నిత్యాగ్ని హోత్రులు వారి శిష్యులు వచ్చి చేరారు..మేము కంద మూలాలు తింటూ ఉంటాము. మా ఆహారం మేము సంపాదించుకుంటాము అని వారు ధర్మరాజుకు చెబుతారు.

జీవకోటికి ఆహారాన్ని నీటిని ప్రసాదించేది సూర్యుడు. కనుక నీవు సూర్యుని ప్రార్ధించి నీ కోరిక నెరవేర్చుకో అని ధర్మరాజుకు పెద్దలు సలహా ఇస్తారు.. ధర్మరాజు నిష్టతో సూర్యుని పూజించాడు. సూర్యుడు ప్రత్యక్షమై ధర్మరాజుకు ఒక రాగి పాత్రను ఇస్తాడు.

ధర్మరాజుకి ఓ విషయం చెబుతాడు, మీరు అడవిలో సేకరించే కందమూలాలు ఫలాలు మీ భార్య చేత వండించండి అది నాలుగు వంటలుగా సిద్దం అవుతుంది అనిచెబుతాడు, అలా అక్షయపాత్రతో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా భోజనం సమకూరుతుంది.