ఆలయాల్లో దేవున్ని ఎలా దర్శించుకుంటున్నారు… అసలు ఎలా దర్శించుకోవాలో తెలుసా….

ఆలయాల్లో దేవున్ని ఎలా దర్శించుకుంటున్నారు... అసలు ఎలా దర్శించుకోవాలో తెలుసా....

0
92

కష్టాలను తీర్చుకోవడానికి మనము భగవంతుడిని ఆశ్రయిస్తాము… అయితే మన కోరిక తీరాలంటే అందుకు తగిన అర్హత భగవంతుడి దగ్గర పొందాలి.. ప్రధానంగా ఆలయానికి వచ్చే భక్తుల ప్రవర్తన ఆలయంలో పాటించాల్సిన విధానాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఆలయాన్ని ప్రధక్షిణ చుట్టి రావడానికి ముందే దైవానికి ప్రసన్నమైనమనస్సుతో నమాస్కారం చేయాలి…

ప్రదక్షణ చేసిన తర్వాత ఆలయంలోకి ప్రవేశించాలి… ప్రదక్షణ చేసే సమయంలో తప్ప ఇంకెప్పుడు దేవాలయం ద్వజస్థంభం నీడనకానీ ప్రాకారం నీడను కానీ దాటకూడదు..

చంచలమైన మనస్సుతో స్వామిని దర్శించకూడదు…

ఆలయంలో దేవుని ముందు నిలబడి అబద్దాలు చెప్పకూడదు..

ఎందుకంటే ఆయన సత్యస్వరూపుడు కాబట్టి ఆయన ఎదుట అపద్దాలు చెప్పకూడదు…

అలాగే దేవాలయంలో దేవని వీపు భాగం చూపిస్తు కూర్చో కూడదు వస్త్రంతో కానీ శాలువాతో కానీ శరీరం కప్పుకోవాలి… దేవాలయంలో ప్రవేశించి భక్తితో రోదించకూడదు రోదిస్తూ దేవునిస్తుతించకూడదు..