అమెరికాలో వింతగా పెళ్లి చేసుకున్న జంట ఇలా కూడా పెళ్లి చేసుకుంటారా

అమెరికాలో వింతగా పెళ్లి చేసుకున్న జంట ఇలా కూడా పెళ్లి చేసుకుంటారా

0
108

అయితే పెళ్లి అంటే రెండు కుటుంబాల కలయిక…వందేళ్ల జీవితానికి పునాది…ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రాకుండా వారికి వారే సర్దుకుపోవాలి ఈ జీవితంలో.. కాని పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా ప్రేమ పెళ్లి అయినా ఇఫ్పుడు కామన్ అనే చెప్పాలి.. ఇప్పుడు ఏ పెళ్లి చేసుకున్నా విడిపోవడానికి కారణాలు మాత్రం చాలా చిన్న విషయాలే ఉంటున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ మధ్య గొడవలు పడటం సర్వ సాధారణంగా జరుగుతోంది.

అంతేనా ఏకంగా చిన్న చిన్న గొడవలకి విడాకుల వరకూ వెళ్ళిపోతారు. అమెరికాలో ఓ జంట ఇలానే చేసింది… అయితే చివరికి వారి జీవితంలో ఎవరికి రాని లక్ వచ్చింది. జేసన్ .వాలరీ. ఈ ఇద్దరు అమెరికాలోని మసాచుసెట్స్ కి చెందిన వాళ్ళు. వీరు ఇద్దరూ ఓ కాఫీ షాపులో మొదటి సారిగా కలుసుకుని ప్రేమించుకున్నారు. అక్కడే వారు పెళ్లి చేసుకున్నారు

ఇలా సంవత్సరం అయిన తర్వాత అభిప్రాయ భేదాలు వచ్చాయి… చివరకు ఆ తరువాత అదే కాఫీ షాపులో 1992లో విడిపోయారు. అన్నింటికి ఆ కాఫీ షాప్ వేదిక అయింది, ఆ తరువాత ఇద్దరూ వేరేవేరే పెళ్ళిళ్ళు చేసుకున్నారు.. కానీ వారి జీవితాలలో ఎదో లోటు కనిపించింది, అందుకే ఎవరికి వారు తమ జీవిత భాగస్వాములకి విడాకులు మళ్లీ ఇచ్చారు. ఈ సమయంలో సింగిల్ గా ఉంటున్నారు. ఈ సమయంలో జేసన్ ఓ ఫంక్షన్ కు వెళ్లాడు అక్కడకు వాలరీ కూడా వచ్చింది.. అయితే 27 సంవత్సరాలు అయింది వారు విడిపోయి, అయినా బాగా పలకరించుకున్నారు.. పాత గొడవలు మర్చిపోయారు. అలా మళ్లీ ఫోన్లు మాట్లాడుకుని పెళ్లి చేసుకుందాం అని అనుకున్నారు.. అదే కాఫీ షాపులో మళ్లీ వీరిద్దరూ ఒకటి అయ్యారు.