అమ్మాయిలు ఇక్కడ పెళ్లి కోసం ఇలాంటి వింత ఆచారం పాటిస్తారట

అమ్మాయిలు ఇక్కడ పెళ్లి కోసం ఇలాంటి వింత ఆచారం పాటిస్తారట

0
88

వింత ఆచారాలు వింత సంప్రదాయాలు ఇప్పటి వరకూ మనం చాలా విన్నాం, ఇక అమ్మాయిలు తమకు కావలసిన అబ్బాయిని సెలక్ట్ చేసుకునే వారిని చూశాం, అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సంప్రదాయం చాలా వింతగా ఉంటుంది.

అమెజాన్ సుర్మా అనే తెగ అమ్మాయిలకు వాళ్ళ లిప్ సైజు ను బట్టి వారికి డిమాండ్ అనేది ఉంటుందట.
ఇక్కడ అబ్బాయిలు అందరూ అమ్మాయిల లిప్స్ బట్టీ వారిని వివాహం చేసుకుంటారు, అంతేకాదు ఇక్కడ అమ్మాయి లిప్స్ ని కత్తిరించుకుంటారు.

కింద పెదవిని కత్తిరించి ,దానిలో ఒక చెక్క డబ్బా పెడతారు . అలా కొద్దినెలల ఉంచుతారు. వారి కింద పెదవి రెండు సెంటీమీటర్ల నుండి నాలుగు సెంటీమీటర్ల వరకు పెరుగుతుందట. ఇలా అయిన అమ్మాయిలను వారు అందగత్తెగా గుర్తిస్తారు, అప్పుడు ఆమె తల్లిదండ్రులకి అబ్బాయిలు ఎదురు కట్నం ఇచ్చి ఆమెని వివాహం చేసుకుంటారు.. లిప్ డిస్క్ కాస్త రిస్క్ అయినా తల్లిదండ్రుల కోసం అమ్మాయిలు ఇలా చేస్తున్నారు.