బిగ్‌బాస్ అభిజిత్ ఆట‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన యాంక‌ర్ ర‌వి

బిగ్‌బాస్ అభిజిత్ ఆట‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన యాంక‌ర్ ర‌వి

0
137

బిగ్ బాస్ సీజ‌న్ 4 చాలా స‌రికొత్త‌గా సాగుతోంది, టాస్కులు రిలేష‌న్లు ప్రేమ‌లు వివాదాలు తిట్టుకోవ‌డాలు అబ్బో ఈ సీజ‌న్ లో ముందు ప‌స లేదు అనిపించినా ఇప్పుడు చాలా క‌ని‌పిస్తోంది.
మొన్న జ‌రిగిన ఉక్కు హృద‌యంటాస్క్ వ‌ల్ల‌ హౌస్ ఎంత ర‌సాభాస‌గా మారిందో తెలిసిందే, దీంతో ఇక్క‌డ కండ బలం ముఖ్య‌మా బుద్ది బ‌లం ముఖ్యగా అనేదానిపై సోష‌ల్ మీడియాలో అనేక కామెంట్లు ట్రోల్స్ వ‌చ్చాయి.

అయితే ఇక్క‌డ బుద్దిబ‌లంతో తెలివిగా అభిజిత్ కిడ్నాప్ ప్లాన్ బాగా వ‌ర్క్ అవుట్ అయింది, అభిజిత్ బుద్ధికి ప‌ని చెప్పాడు. కిడ్నాప్ ప్లాన్ ర‌చించ‌గా, అది వీర లెవల్లో స‌క్సెస్ అయింది. మ‌నుషుల టీమ్ గిల‌గిలా కొట్టుకున్నారు, మొత్తానికి అభిజిత్ టీమ్ విన్ అయింది. ఎవ‌రు ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా అభిజిత్ మాత్రం అలాగే ఉన్నాడు, ఇది గేమ్…..గేమ్ ని గేమ్ లా ఆడాలి అని చెప్పాడు.

ఇక్క‌డే అస‌లైన విష‌యం ఉంది, ఎవ‌రు కూల్ గా గేమ్ ఆడ‌తారో వారే ఫినిష్ చేస్తారు అని అనేక సార్లు రుజువు అయింది… ఇక్క‌డ అదే జ‌రిగింది.యాంక‌ర్ ర‌వి అభిజిత్‌కు బంధువు అవుతాడట‌.
నేను బిగ్‌బాస్ ప్రోమోలు చూస్తున్నాను. గేమ్‌లో ప‌రిస్థితిని అంచ‌నా వేసి అప్ప‌టిక‌ప్పుడు అభిజిత్ కిడ్నాప్ ప్లాన్ చేయ‌డం ప్ర‌శంస‌నీయం అన్నాడు యాంక‌ర్ ర‌వి.

అత‌ను చాలా బాగా ఆడాడు, ప్లాన్ బాగుంది, కూల్ గా చాలా స‌హ‌నంగా స‌మాధానాలు చెప్పాడు
అత‌డిలో నాకు ఎమ్ఎస్ ధోనీ క‌నిపిస్తున్నాడు. ఏదైనాక్లాష్ వ‌స్తే అర‌వ‌డు కూర్చుని సాల్వ్ చేసుకుందాం అనేటైపు…రియ‌ల్ లైఫ్‌లో కూడా ఇలానే ఉంటాడు. చాలా సైలెంట్‌. అవ‌స‌ర‌మైతేనే మాట్లాడ‌తాడు మంచి వ్య‌క్తి అని యాంక‌ర్ ర‌వి తెలిపాడు. అభి టాప్ 3లో ఉంటాడు అని తెలిపాడు ర‌వి.