అందమైన అమ్మాయి మెసేజ్ చేసింది – అడ్డంగా బుక్కయ్యాడు

అందమైన అమ్మాయి మెసేజ్ చేసింది - అడ్డంగా బుక్కయ్యాడు

0
100

అందమైన అమ్మాయి కనిపించగానే అట్రాక్ట్ అవ్వడం ఆమెతో సోషల్ మీడియాలో ఛాట్ చేయడం కొన్ని పిక్స్ పంపించడం ఆమె పంపిన పిక్స్ చూసి అవి నిజం అని భావించడం ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి , అయితే అసలు అక్కడ నుంచి పంపేవారు అమ్మాయా లేదా అబ్బాయా అనేది తెలుసుకోవాలి.

ఇలాంటి ఆలోచన చాలా మంది చేయడం లేదు, తాజాగా ఓ డేటింగ్ యాప్ లో అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు, ఆమె నుంచి రిక్వెస్ట్ రావడంతో ఛాట్ చేశాడు, కొద్ది రోజులు బాగానే ఉంది, తర్వాత అతని వీడియోలు పర్సెనల్ ఫోటోలు ఆమెకి పంపాడు.

కొద్దిరోజుల తర్వాత వాటితో ఆమె బ్లాక్ మెయిల్ చేసింది. ఆపై బెదిరింపులకు దిగిన ఆమె, తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే, తన దగ్గర ఉన్న ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని హెచ్చరికలకు దిగింది. ఇప్పటికే 73 వేల రూపాయలు ఇచ్చాడు, చివరకు ఇంకా వేధింపులు పెరగడంతో ఇప్పుడు పోలీసుల దగ్గరకు వెళ్లాడు, చూశారుగా అబ్బాయిలు జర జాగ్రత్త.