అదో వింత సంప్రదాయం. అక్కడ పెళ్లి అన్నయ్య చేసుకున్నా తమ్ముళ్లు అందరికి కూడా ఆమే భార్య, అది అక్కడ సంప్రదాయం, వెంటనే మీకు మహాభారతంలోని ద్రౌపతి గుర్తురావచ్చు ఇది కూడా అలాంటి ఆచారమే.నేపాల్ దగ్గర డోల్పాలో ఈ ఆచారం అనాధిగా వస్తోంది, ఇది అక్కడ తెగలో అందరూ పాటిస్తారు.
ఇక చైనాలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ ఆచారం పాటిస్తారు,ఇక అన్నగారు పెళ్లి చేసుకున్న ఆమెని తమ్ముళ్లు అందరూ భార్యగా చేసుకుంటారు, ఇక .కుటుంబం పై పూర్తి పెత్తనం ఆమెకి ఉంటుంది, అందరిని సమానంగా చూసుకుంటుంది, ఇక సోదరులు ఎంత మంది ఉన్నా అందరూ కూడా కష్టపడి పని చేయాలి.
అందరూ నగదు తెచ్చి ఇవ్వాలి, అలాగే సంసారం కూడా అందరితో చేస్తారట, అయితే ఎప్పటి నుంచో పేదరికం వల్ల ఈ ఆచారం పాటిస్తున్నారట, భార్య గురించి సోదరులు ఎప్పుడూ గోడవపడరట,, ఇక ఓ భర్త మరణించినా మరో భర్త ఉంటాడు అని ఇలాంటి ఆచారం పాటిస్తున్నారట, ఆమెకి పుట్టిన పిల్లలపై అందరికి హక్కులు ఉంటాయి.