తెరపై మళ్లీ అనుష్క ప్రభాస్ పెళ్లి టాపిక్… క్లారిటీ ఇచ్చిన అనుష్క….

తెరపై మళ్లీ అనుష్క ప్రభాస్ పెళ్లి టాపిక్... క్లారిటీ ఇచ్చిన అనుష్క....

0
140

తెలుగు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ల పెళ్లి విషయం గతంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే… ఈ విషయంపై వీరిద్దరు క్లారిటీ ఇచ్చినా కూడా అనేక సందర్భాల్లో వార్తలు వచ్చాయి…

ఇది ఇలా ఉంటే ఇటీవలే అనుష్క ట్విట్టర్ ఖాతాను తెరిచిన సంగతి తెలిసిందే… తరుచు తనకు సంబంధించిన అప్ డేట్స్ ను ఇస్తూ వస్తోంది… ఈ క్రమంలో ఆమె అభిమానులు అడిగి ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది… ప్రభాస్ మీ జోడీ బాగుంటుంది ప్రతీ ఒక్కరు మీ జంటను ఇష్టపడతారు మరో మూవీ చేయండని కోరాడు..

దీనికి స్పందించిన అనుష్క కథకు తన అవసరం ఉందని తవస్తే నేను తప్పకుండా ప్రభాస్ తో ఇంకో సినిమా చేస్తానని తెలిపింది… ఇంకో అభిమాని అనుష్క వివాహం జరుగుతున్న సినిమా పిక్ ను పోస్ట్ చేస్తూ దీనికి సమాధానం చెప్పాలని కోరాడు… ఇందుకు అనుష్క క్లారిటీ ఇస్తూ ఇది ఓ సినిమా కోసం తీసిన చిత్రం షాట్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇది మిర్చి సినిమాలోనిదని చెప్పింది…