అర‌గంట‌లో ముహూర్తం శోభ‌నానికి పోలీసులు బ్రేక్ కార‌ణం ఇదే

అర‌గంట‌లో ముహూర్తం శోభ‌నానికి పోలీసులు బ్రేక్ కార‌ణం ఇదే

0
40

వారిద్ద‌రికి పెద్ద‌లు నిర్ణ‌యించిన ముహూర్తంలో పెళ్లి చేశారు, అంతా బాగానే ఉంది ,ఈ లాక్ డౌన్ వేళ ముందుగా ఫిక్స్ చేసుకున్న ముహూర్తంలో కొంద‌రు ఇంటి స‌భ్యుల స‌మ‌క్షంలో పెళ్లి కానిచ్చేశారు.. తొలిరాత్రి కోసం వరుడి ఇంట్లో ఏర్పాట్లు చేశారు. దీంతో వరుడు.. తన భార్యను ఇంటికి తీసుకెళ్లాడు. రాత్రి శోభనానికి సిద్ధమవుతుండగా ఆరోగ్య శాఖ అధికారులు పోలీసులు అక్క‌డకు చేరుకున్నారు.

అయితే మేము సింపుల్ గా పెళ్లి చేశాం, పెద్ద సంఖ్య‌లో జ‌నం రాలేదు, మ‌రి ఎందుకు వ‌చ్చారు అని కుటుంబ స‌భ్యులు ప్ర‌శ్నించారు, దీనికి పోలీసులు షాకింగ్ స‌మాధానం ఇచ్చారు..వరుడు ఇటీవల మంగళూరు నుంచి వచ్చినట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. అక్కడ కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని, రెడ్ జోన్ నుంచి వచ్చినందుకు అందరూ క్వారంటైన్లో ఉండాలని అధికారులు సూచించారు.

ఈ రోజు శోభ‌నం అని ఏర్పాట్లు చేశాము అని చెప్పినా కుద‌ర‌దు అని తెలిపారు, త‌ర్వాత ముహూర్తం పెట్టుకోండ‌ని ఇది లైఫ్ కు సంబంధించింది, క‌చ్చితంగా నియ‌మాలు పాటించాల్సిందే అని తెలిపారు పోలీసులు, దీంతో చాలా మంది పోలీసులు చెప్పింది క‌రెక్ట్ అంటున్నారు, త‌ర్వాత అయినా శోభ‌నం చేసుకోవ‌చ్చు ముందు ప్రాణాలు ముఖ్యం క‌దా అని చెబుతున్నారు.