అరవింద సమేత లో ఆ సీన్ సినిమాకే హైలెట్ అంట

అరవింద సమేత లో ఆ సీన్ సినిమాకే హైలెట్ అంట

0
118

జూ.ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అరవింద సమేత – వీర రాఘవ సినిమా హడావిడి మొదలైపోయింది. మరో పదిహేను రోజుల్లో విడుదలకు సిద్దమవుతున్న అరవింద సమేత సినిమా ప్రమోషన్స్ అప్పుడే స్టార్ట్ అయ్యాయి. పూజ హెగ్డే హీరోయిన్ గా ఎన్టీఆర్ మాస్ గా కనబడనున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ అండ్ టీజర్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచనాలున్న ఈ సినిమాకి సంబందించిన వర్కింగ్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో ఎలక్షన్స్ కి సంబంధించిన ఒక ఎపిసోడ్ వుందట. అది ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఎన్టీఆర్ తో ముడిపడిన స్థానిక ఎన్నికలకి సంబంధించిన సీన్ ను విజిల్స్ పడేలా త్రివిక్రమ్ చిత్రీకరించాడని చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ ఎన్టీఆర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుందని అంటున్నారు.