బిగ్ బాస్ – అరియానా గ్లోరి రెమ్యునరేషన్ ఎంతంటే

బిగ్ బాస్ - అరియానా గ్లోరి రెమ్యునరేషన్ ఎంతంటే

0
124

బిగ్బాస్ తెలుగు సీజన్ 4 షో ఈ సారి సరికొత్తగా సాగుతోంది, అంతేకాదు అందాల భామలు, టాస్కులు, రిలేషన్లు ఈసారి మరింత బజ్ తీసుకువస్తున్నాయి.. ఇక అభిమానులు బాగా బిగ్ బాస్ చూస్తున్నారు, ప్రతీ వారం ఆటతీరు బట్టీ వారిని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేస్తున్నారు. ఇక ఈసారి హౌస్ లో చెప్పుకోవాల్సింది, అందాల తార అరియానా గ్లోరీ గురించి.

ఆమె ఆట ఇప్పుడు ప్రేక్షకులు అందరికి నచ్చుతోంది, అయితే హౌస్ లో కాస్త కురచ దుస్తులు వేసుకుంటున్న అమ్మాయిల్లో అరియానా ముందు ఉంటుంది అంటారు, అయితే తనకు నచ్చిన విధంగా ఆమె ఉంటుంది, అంతేకాదు ఈసారి ఉమెన్ బిగ్ బాస్ టైటిల్ కొట్టాలి అని భావిస్తున్న వారిలో ఆమె కూడా ఒకరు.

అయితే ఆమెకి ఎంత రెమ్యునరేషన్ ఉంటుంది అనేదానిపై సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి, అయితే ఆమె పలు యూ ట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు చేస్తూ బిజీగా ఉన్నారు, ఆమెకి ఫుల్ డిమాండ్ ఉంది, ఈ సమయంలో బిగ్ బాస్ టీమ్ ఆమెకి వారానికి లక్షన్నర చొప్పున ఇస్తాము అని ఒప్పందం చేసుకున్నారు అని వార్తలు వస్తున్నాయి.