ఆర్మీ ఉద్యోగి ఓ యువతిని ప్రేమించి చివరకు ఎంత పని చేశాడో చూడండి…

ఆర్మీ ఉద్యోగి ఓ యువతిని ప్రేమించి చివరకు ఎంత పని చేశాడో చూడండి...

0
97

ఆర్మీ ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసంచేశాడని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ఓ యువతి… ఈ సంఘటన నిజాంపట్నంలో జరిగింది…. ముత్తుపల్లి గ్రామానికి చెందిన నాగరాజు రెడ్డి కొద్దికాలంగా ఆన్ లైన్ డెలివరీ బాయ్ గా జాబ్ చేస్తున్నాడు…

ఈ క్రమంలోనే ఓ యువతిని జాబ్ లో చేర్పించాడు… కొన్నిరోజులకు వీరిద్దరు ప్రేమించుకున్నారు… పెళ్ళి కూడా చేసుకోవాలిని నిర్ణయించుకున్నారు… ఇంతలో నాగరాజు రెడ్డికి ఆర్మీలో జాబ్ వచ్చింది… ఆర్థికంగా సెటిల్ అయ్యాము కదా వివాహం చేసుకుందామని చెప్పింది ఆ యువతి… సరే అని నాగరాజు చెప్పాడు వాట్సప్, ఫేస్ బుక్ లలో చాటింగ్ చేసుకునేవారు…

ఈ నేపథ్యంలోనే యువతి వివాహం చేసుకుందామన పట్టుబట్టి నాగరాజు ఇంటికి వెళ్లింది.. అతడి తల్లిదండ్రులను కలిసింది… వారు ఆమెను బెధిరించారు….. తమ కుమారుడు ఉద్యోగం చేస్తున్నాడని మంచి సంబంధం చూసి వివాహం చేస్తామని హెచ్చరించారు…దీంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది… ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..