బాబోయ్ అతిపెద్ద అనకొండ రోడ్లపై ఏం చేసిందంటే

బాబోయ్ అతిపెద్ద అనకొండ రోడ్లపై ఏం చేసిందంటే

0
109

పాములు ఈ కాలంలో మరిన్ని బయటకు వస్తాయి, అయితే రోడ్లపైకి పెద్ద పాములు వచ్చాయి అంటే కచ్చితంగా రోడ్డుపై అడ్డంగా ఉండిపోతాయి.. ఏకంగా అనకొండలాంటివి కడుపులో ఏదైనా పెట్టుకుని రోడ్డుపైకి వస్తే దాదాపు గంటల పాటు అలాగే ఉండిపోతాయి, ఈ సమయంలో పెద్ద అనకొండ అయితే దానిని కదిలించలేం.

దీంతో కారులో ప్రయాణికులు రోడ్డు దాటలేరు, బ్రెజిల్లోని ఒక ప్రదేశంలో పెద్ద అనకొండ రోడ్ క్రాస్ చేస్తుండటంతో అటుగా వెళ్లుచున్న వాహనదారులు ఒక్క సారిగా ఆగిపోయారు.. ముందుగా మొదటి రోడ్దును నెమ్మదిగా క్రాస్ చేసిన అనకొండ, రెండో రోడ్డు ఎక్కే సరికి ముందుకి వెళ్లకుండా రోడ్డు దగ్గర ఆగిపోయింది.

అయితే దాని శరీరంలో చాలా బరువైన ఆహరం ఏదో మింగింది అని అర్దం అవుతోంది, దీంతో దానిని ఎవరూ ముందుకు కదలలేకపోయారు, దాదాపు 20 అడుగుల పొడవు ఉంది, అది రోడ్డుకి అడ్డంగా నాలుగు గంటల పాటు ఉంది, అంత సేపు 5 కిలోమీటర్ల ట్రాఫిక్ ఆగిపోయింది, చివరకు జూ సిబ్బంది వచ్చి దానిని రోడ్డు దాటించారు.