ఈరోజుల్లో వావివరసలు ఏమీ ఉండటం లేదు, చాలా మంది సొంత అన్న చెల్లి, లేదా అక్క తమ్ముడు కూడా కొన్ని ఘటనల్లో ప్రేమించుకున్నారు, ఇంటి పేరు ఒకటే ఉన్న వారు కూడా ప్రేమించి పారిపోయి వివాహం చేసుకున్న వారు కూడా ఉన్నారు.
పెద్దలు ఎంత వద్దు అన్నా ఇలాంటి ప్రేమలు జరుగుతూనే ఉన్నాయి. నగరంలో కారు డ్రైవర్ గా పని చేస్తున్న వ్యక్తి ఓ యువతితో ప్రేమలో పడ్డాడు..వారిద్దరూ వరుసకు బాబాయి కూతుళ్లు అవుతారు. ఈ విషయం తెలిసినప్పటికీ వాళ్లిద్దరూ గత 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ఇక వీరి వ్యవహారం ఆ అమ్మాయి తల్లిదండ్రులకి తెలిసింది, మరో అబ్బాయితో ఆమెకి వివాహం చేయాలి అని భావించారు, దీంతో వీరిద్దరూ కలిసి చనిపోవాలి అని డిసైడ్ అయ్యారు, అక్కడ పురుగలు మందు తాగి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు, ఈ విషాదంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరు అయింది.