అరవింద సమేత ఆడియో రిలీజ్ ఫంక్షన్ బాలయ్య ?

అరవింద సమేత ఆడియో రిలీజ్ ఫంక్షన్ బాలయ్య ?

0
161

సినీ నటుడు నందమూరి హరికృష్ణ నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి మనకు తెలిసిందే. అయన మరణంతో నందమూరి కుటుంభం సభ్యులు ఏకమయ్యారు.హరికృష్ణ అంత్యక్రియలు ముగిసిన తరువాత జూనియర్ ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ లతో బాలకృష్ణ మాట్లాడుతూ భోజనం చేసే వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోతో బాలకృష్ణ కు జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య గొడవలున్నాయనే మాటలకూ బాలకృష్ణ చెక్ పెట్టారు.

ఇక విషయానికి వస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అరవింద సమేత వీర రాఘవ. ఈ సినిమా అక్టోబర్ 11వ తేదీ రిలీజ్ కానుందని మనకు తెలిసిందే. ఈ సినిమా ఆడియో రిలీజ్ సెప్టెంబర్ 16 వ తేదీ నోవాటెల్ లో జరపాలని చిత్ర యూనిట్ భావించారు.అనూహ్యంగా హరికృష్ణ మరణంతో ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ ను అక్టోబర్ మొదటి వారం లో జరపాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్టుగా తాజా సమాచారం. అరవింద సమేత ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు బాలకృష్ణ ను ముఖ్యఅతిథిగా ఎన్టీఆర్ ఆహ్వానించారని సమాచారం. ఒకే వేదిక పై బాబాయ్, అబ్బాయి కనబడుతున్నారనే వార్తా తెలిసిన నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.