బాలయ్య ఆ హీరోని కొట్టడానికి కారణం ఇదేనట – హీరో ఏమన్నారంటే

బాలయ్య ఆ హీరోని కొట్టడానికి కారణం ఇదేనట - హీరో ఏమన్నారంటే

0
99

నందమూరి నట సింహం బాలకృష్ణ తన మనసులో ఏది అనుకుంటే అది చేస్తారు, అంతేకాదు ఆయన ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు, ఏ విషయంలో ఆయన వెనుక అడుగు వేయరు, అనవసర విషయాలు కూడా ఆయన పెద్దగా పట్టించుకోరు, అందుకే ఆయన అభిమానులు ఆయనని అంతలా అభిమానిస్తారు, మా బాలయ్య అభిమానులని కొట్టినా అది ప్రేమతోనే అని క్రమశిక్షణ కోసం అలా చేస్తారు అని అభిమానులు కూడా అంటారు.

తాజాగా బాలయ్య.సెహరి అనే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసారు.ఈ చిత్రంలో హర్ష కనుమల్లి, సిమ్రాన్ చౌదరి హీరో, హీరోయిన్స్గా నటించారు. అయితే ఈ సమయంలో బాలయ్య మాటలు కూడా వైరల్ అయ్యాయి.

సెహరిపోస్టర్ విడుదల కార్యక్రమంలో ఈ సినిమా హీరో హర్షను చేతిని బాలయ్య కొట్టడం కనిపించింది.
ఇక దీనిపై అనేక కామెంట్లు వీడియోలు వచ్చాయి, అయితే దీని గురించి తాజాగా ఆ హీరో తెలిపాడు అసలు రీజన్.. మా బాలయ్య బంగారం అన్నారు. ఆయన తనను కావాలని కొట్టలేదని తాను పుర చేత్తో అంటే ఎడమ చేత్తో పోస్టర్ పట్టుకోవడంతో వెంటనే చేయిపై ఒకటి వేసారన్నారు. తర్వాత కుడిచేతిలో పోస్టర్ పట్టుకున్నాను అని తెలిపారు, మొత్తానికి బాలయ్య ఏదీ కారణం లేకుండా చేయడు అంటున్నారు అభిమానులు.