అరటి పండ్లు అమ్మలేదు రైతు వాటితో అద్భుతం చేశాడు

అరటి పండ్లు అమ్మలేదు రైతు వాటితో అద్భుతం చేశాడు

0
106

కృషి ఉంటే మనుషులు రుషులవుతారు మహాపురుషులవుతారు అని మాట విన్నాం, పట్టుదల ఆలోచన శ్రమ తోడైతే ఏదైనా సాధించగలం, ఆలోచన ఆచరణలో పెడితే సాధించడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఈ లాక్ డౌన్ సమయంలో చాలా మంది వ్యాపారులు అడ్డంగా నష్టపోయారు.

ఎవ్వరూ పళ్ళను కొనడానికి ముందుకు రాలేదు. దీంతో పళ్ళ రైతులు పండించిన పళ్ళు వృధా అయ్యాయి. కర్ణాటకలోని బళ్లారి, కంపిలి తాలూకా, రామసాగర గ్రామానికి చెందిన కే.గంగాధర్ అనే రైతుకి
దీంతో చాలా నష్టం వచ్చింది.

గంగాధర్ సుగంధి రకం అరటిపళ్ళను పండించాడు. కానీ, గిట్టుబాటు ధర రాలేదు. దీంతో వాటిని ఏం చేయచ్చో ఆలోచించాడు. అయితే ఈ అరటిపళ్లు ఎండబెట్టి అమ్మితే వాటిని విదేశాల్లో బాగా కొంటున్నారు అని తెలుసుకున్నాడు.

ఇలా ఎండబెట్టిన అరటిపళ్ళను ఉత్పత్తి చేయాలనుకున్నాడు. వెంటనే నెల రోజుల వరకూ అరటి పండ్లు ఎండబెట్టాడు… ఓ డబ్బాలో ప్యాక్ చేసి జిల్లాలోని హోల్సేస్, రిటైల్ దుకాణాలకు విక్రయించి లాభాలు పొందుతున్నాడు. ఇక ఇలా ఎండబెట్టిన అరటిలో మంచి పోషకాలు ఉంటాయి,.ఈ డ్రైఫ్రూట్ను తింటే ఆరోగ్యానికెన్నో లాభాలున్నాయని అంటున్నారు నిపుణులు, ఇప్పుడు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి, ఈ డ్రై బనానాస్.