మన బ్యాంకు ఖాతాలో ఒకేసారి కోట్ల రూపాయల నగదు డిపాజట్ అయితే ఆశ్చర్యం వేస్తుంది, నిజంగా ఎవరైనా పొరపాటుగా వేశారా అనే అనుమానం వస్తుంది, అయితే ఆ నగదు తీసుకుందాం అనుకున్నా కష్టమే, ఎందుకు అంటే వెంటనే ప్రాబ్లమ్ రెక్టిఫై చేసుకుని ఆ నగదు వెనక్కి తీసేస్తారు బ్యాంకు సిబ్బంది.
అయితే తాజాగా అమెరికాలో ఓ వ్యక్తి ఖాతాలోకి ఏకంగా ఎంత నగదు జమ అయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..మసాచుసెట్స్ లో తన బ్యాంకులో ఎంత డబ్బుందో చూసుకుందామని ఆ ప్రాంతంలో సైకియాట్రిస్ట్ గా పనిచేస్తున్న బ్లెయిసీ అగ్వైర్ అనే వ్యక్తి మొబైల్ యాప్ ద్వారా లాగిన్ అయి చూసుకున్నాడు.
అందులో ఏకంగా అతని ఖాతాలో 18,166 కోట్లు కనిపించడంతో అవాక్కయ్యాడు. అతనికి బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఖాతా ఉంది. వెంటనే ఆ డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో బ్యాంకు సిబ్బందిని అడిగాడు, వెంటనే వారు తప్పు చూసుకున్నారు, అయితే అది నిజంగా నగదు జమ అవ్వలేదట, అదో డిస్ ప్లే ఎర్రర్ మాత్రమేనని తెలిపారు.